ఏపీ అసెంబ్లీ: ముగ్గురు టీడీపీ  సభ్యుల సస్పెండ్

ఏపీ అసెంబ్లీ: ముగ్గురు టీడీపీ  సభ్యుల సస్పెండ్

ఏపీ అసెంబ్లీలో  అధికార, విపక్షాల  మధ్య మాటల  యుద్ధం  కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ,  బీసీ  మైనార్టీ  మహిళలకు  45 ఏళ్లకే  పింఛను విషయంలో… అధికార, ప్రతిపక్షాల  మధ్య వాగ్వాదం  జరిగింది. దీంతో  ముగ్గురు టీడీపీ  సభ్యులను సస్పెండ్ చేశారు  స్పీకర్. బడ్జెట్ సమావేశాలు  ముగిసేవరకు  వీరిపై  సస్పెన్షన్ విధించారు. అయితే  స్పీకర్  సస్పెన్షన్ కు  నిరసనగా  అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి  సభలో నిరసన  తెలిపారు. దీంతో  సభ నుంచి  ముగ్గురిని బయటకు  తీసికెళ్లారు మార్షల్స్.