రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో ముగ్గురు స్టూడెంట్లను కరిచిన పాము

గద్వాల, వెలుగు : టాయిలెట్‌‌కు వెళ్లిన ముగ్గురు స్టూడెంట్లు పాముకాటుకు గురయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లా కేంద్రంలోని అర్బన్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో శనివారం జరిగింది. గోనపాడు గ్రామానికి చెందిన అనిల్‌‌కుమార్‌‌, కేటీ దొడ్డి మండలం తూర్పు తండాకు చెందిన సంతోష్‌‌ నాయక్‌‌, అయిజ మండలం తనగల గ్రామానికి చెందిన అర్జున్‌‌కుమార్‌‌ మెకానిక్‌‌ షాపులో పనిచేస్తుండగా చైల్డ్‌‌ ప్రొటెక్షన్‌‌, లేబర్‌‌ ఆఫీసర్లు గుర్తించి శుక్రవారం అర్బన్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో చేర్పించారు.

శనివారం వీరు టాయిలెట్‌‌కు వెళ్లగా అక్కడ పాము కరిచింది. విషయం స్కూల్‌‌ సిబ్బందికి చెప్పడంతో వెంటనే గద్వాల ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.