హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జోరందుకున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు అక్రమార్కు లపై కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ కట్టడాలను అని తేలితే చాలు ఎటువంటి భవనాలనైనా నేలమట్టం చేస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. గత కొద్ది రోజలుగా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా.. తాజాగా సంగారెడ్డి జిల్లాు కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని పెద్ద చెరువులో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది.
గురువారం ( సెప్టెంబర్ 26) మల్కాపూర్ లోని పెద్ద చెరువులో అక్రమంగా నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని బాంబులతో పేల్చి కూల్చివేసింది. పెద్ద చెరువు FTL పరిధిలో భవనాన్ని నిర్మించారని గుర్తించిన హైడ్రా.. దాన్ని బాంబుల ద్వారా నేలమట్టం చేసింది. అయితే శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.