జైత్రాం తండాలో .. ఒకే ఇంట్లో ముగ్గురికి డెంగ్యూ లక్షణాలు 

  • ఆర్వీఎం హాస్పిటల్​లో ఇద్దరు, నిలోఫర్​లో చిన్నారికి చికిత్స 

మెదక్/ చేగుంట, వెలుగు: మెదక్​ జిల్లా చేగుంట మండలం జైత్రాం తండాలో ఒకే ఇంట్లో ముగ్గురు డెంగ్యూ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. తండాకు చెందిన గన్యా, బాలింత అయిన సరితకు సిద్దిపేట జిల్లా ములుగు  మండలంలోని ఆర్వీఎం హాస్పిటల్​లో, నెల రోజుల వయసున్న బాబు హైదరాబాద్​ నిలోఫర్ ​హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న డీఎంహెచ్​వో డాక్టర్​ శ్రీరామ్, జిల్లా మలేరియా ఆఫీసర్​ డాక్టర్​నవీన్​తండాను మంగళవారం విజిట్​చేశారు. దోమలు కుట్టడం వల్ల వారికి జ్వరం వచ్చి ఉంటుందని, అయితే మెడికల్ ​రిపోర్టులు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి సోకింది డెంగ్యూ జ్వరమని నిర్ధారించలేమని మలేరియా ఆఫీసర్​ నవీన్​ తెలిపారు.