కరెంట్‌‌‌‌‌షాక్‌‌‌‌‌తో ముగ్గురు మృతి

  •     ఫ్లెక్సీ తొలగిస్తుండగా మెదక్ ​జిల్లాలో ఇద్దరు యువకులు..
  •      కోతులు రాకుండా పెట్టిన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీగలు తగిలి సిరిసిల్ల జిల్లాలో మహిళ మృతి

కొల్చారం, వెలుగు : ఫ్లెక్సీలను తొలగిస్తుండగా కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ఘటన మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అక్కెం నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్ (21), పసుపుల ప్రసాద్ (20) బుధవారం రాత్రి తమ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. 

తమ పొలానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా ఇనుప ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైనున్న విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీగలకు తగిలింది. దీంతో కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, నాయకులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మృతుల ఫ్యామిలీలను పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మృతుల ఫ్యామిలీలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

కోతులు రాకుండా పెట్టిన కరెంటు తీగలు తగిలి...

ఎల్లారెడ్డిపేట, వెలుగు : కోతులు రాకుండా ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైర్లు తగలడంతో షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో వాటి నుంచి రక్షణ కోసం మాజీ ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుద్దాల బాలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఇంటి చుట్టూ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైర్లు ఏర్పాటు చేశాడు. 

బాలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్య రేణుక (56) గురువారం తెల్లవారుజామున నిద్ర లేచి పనులు చేసేందుకు ఇంటి వెనుకకు వెళ్లింది. ఈ టైంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీగలకు తగలడంతో షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి కిందపడిపోయింది. గమనించిన బాలయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానికుల సాయంతో ఆమెను ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు రేణుక అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. బాలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.