బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దందాలో మరో ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అందరూ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్లే

నిర్మల్, వెలుగు : యూబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రిప్టో కరెన్సీ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దందా వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలను నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ జానకి షర్మిల బుధవారం మీడియాకు వెల్లడించారు. దాసరి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కడెం మండలం కన్నాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, బొమ్మిడి ధనుంజయ ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా బోథ్ మండలం సోనాలలో, కైరం వెంకటశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుభీర్ మండలం దావూజీనాయక్ తండాలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీలుగా పనిచేస్తూ మరో వైపు యూబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిప్టో కరెన్సీ దందా కొనసాగిన్నారు. 

స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విస్తృతంగా ప్రచారం చేస్తూ భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. యూబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంకు బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి అసలు సూత్రధారుడని, ఇతడు దేశవ్యాప్తంగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇతడిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయన్నారు. గతంలో అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వారితో పాటు, ప్రస్తుతం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ముగ్గురు ఎనిమిది నెలల నుంచి 

దేశ, విదేశాల్లో రహస్య సమావేశాలు సైతం నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ దందాలో సూత్రధారులుతో పాటు కీలకంగా వ్యవహరిస్తున్న వారికి చెందిన 11 అకౌంట్లను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశామన్నారు. ఈ దందాలో పెట్టుబడి పెట్టిన వారంతా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ముందుకు వస్తే వారికి న్యాయం  చేస్తామన్నారు.