బారాముల్లా: భారత ఆర్మీతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు చనిపోవడం పై దుమారం రేగుతోంది. మృతులు టెర్రరిస్టులు అని.. శ్రీనగర్-బారాముల్లా హైవేపై కాల్పులకు వారు ప్లాన్ చేశారని ఆర్మీ పేర్కొంది. మరోవైపు చనిపోయిన యువకులు అమాయకులని, వారికి ఎలాంటి టెర్రర్ లింక్స్ లేవని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతులు జుబేర్ అహ్మద్, అజాజ్ అహ్మద్ గనాయ్, అథర్ ముష్తాక్‌కు మిలిటెంట్స్‌తో లింక్స్ ఉన్నాయని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరైన అజాజ్ తండ్రి పోలీసు కావడంతో ఈ కేసుకు ప్రాముఖ్యత పెరిగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, త్వరలోనే వాస్తవాలు వెల్లడవుతాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు.
