అంబులెన్స్ లో ముగ్గురు డెలివరీ

ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల 108 సిబ్బంది శుక్రవారం రాత్రి ముగ్గురు గర్భిణులకు వాహనంలోనే పురుడు పోశారు. ఆమనగల్లు పట్టణానిక చెందిన ప్రేమలత పురిటి నొప్పులతో బాధపడుతూ శుక్రవారం రాత్రి 108కు ఫోన్‌‌‌‌ చేసింది. ఆమెను కల్వకుర్తి హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మేడిగడ్డ తండా సమీపంలోకి రాగానే  నొప్పులు ఎక్కువ కావడంతో మహిళ బంధువుల సహకారంతో 108 సిబ్బందే డెలివరీ చేయగా ఆడబిడ్డ పుట్టింది.

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విటాయిపల్లికి చెందిన దివ్యను హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తూ మార్గమధ్యలో పురుడు పోయగా మగ బిడ్డ పుట్టాడు. అలాగే కడ్తాల్‌‌‌‌ మండలం గానుగుమర్లతండాకు చెందిన అఖిలను హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పురుడు పోయగా మగబిడ్డ పుట్టాడు. అనంతరం వారిని హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.