మూడు చింతలపల్లిలో విషాదం..చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం  చోటు చేసుకుంది.  జీనోమ్ వ్యాలీ పోలీసు స్టేషన్ పరిధిలోని మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామలోని  చెరువులో పడి ముగ్గురు చిన్నారులు  మృతి చెందారు.   గ్రామంలోని చెరువు  దగ్గరకు  వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు మృతదేహాలను బయటకు వెలికి తీశారు. మృతులు  గ్రామానికి చెందిన ఆవుల స్వామి, కటికే హుస్సేన్,  సలేంద్రి కనకయ్య కుమారులు  మనోజ్, హర్ష, మణికంటగా గుర్తించారు.   ముగ్గురు చిన్నారులు 15 సంవత్సరాల లోపు వయసున్న వాళ్లే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.