2020 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది ప్రపంచమంతా వణికింది. లాక్‌డౌన్‌తో కోట్ల మంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. టెక్నికల్‌గా చెప్పాలంటే ఈ ఏడాది దేశ ఎకానమీ రెసిషన్‌లోకి జారుకుంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఊహించనంత పెరిగాయి. ఈ ఏడాది కేవలం నెగిటివ్ వార్తలే కాదు కొన్ని పాజిటివ్ అంశాలూ మెరిశాయి. మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్లు పెరిగారు. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. దేశంలోకి ఎఫ్‌డీఐల, ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లోస్ పెరిగాయి. ఇంకా ఈ ఏడాది ఎక్కువగా లాభపడింది ఓటీటీ కంపెనీలే. వీటి సబ్‌స్క్రయిబర్లు అమాంతం పెరిగారు. ఈ ఏడాది వచ్చిన ఐపీఓలు బంపర్ లిస్టింగ్‌లను చూశాయి. మొత్తంగా 2020లో టాప్‌లో నిలిచిన కొన్ని అంశాలను మరోసారి గుర్తుచేసుకుందాం..
పతనమైన ఎకానమీ..
కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో ఈ ఏడాది ఇండియన్ ఎకానమీ భారీగా పతనమయ్యింది. జూన్ క్వార్టర్లో ఇండియన్ జీడీపీ 23.9 శాతం పడగా, సెప్టెంబర్ క్వార్టర్లో కూడా 7.5 శాతం పడింది. టెక్నికల్‌గా చెప్పాలంటే 2020 లో ఇండియన్ ఎకానమీ రెసిషన్‌లోకి వెళ్లింది. జూన్ క్వార్టర్లో దేశ ఎగుమతులు, దిగుమతులు కనిష్టాలకు పడిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 23.52 శాతానికి పెరిగింది. మార్చి నెల మినహా ఈ ఏడాది మొత్తం దేశ ద్రవ్యోల్బణ రేటు ఆరు శాతానికి పైనే నమోదయ్యింది. అన్‌లాక్ ప్రారంభమయినప్పటి నుంచి ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి వస్తోంది.
ఓటీటీలకు కలిసొచ్చింది..
ఈ ఏడాది ఓటీటీ సెక్టార్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వంటి ఫారిన్ ఓటీటీ కంపెనీలతో పాటు, ఆహా, ఆల్ట్ బాలాజీ, యూరోస్ ఇంటర్నేషనల్, జీ5 వంటి ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా లాక్‌డౌన్‌తో లాభపడ్డాయి. వీటి పెయిడ్ సబ్‌స్క్రయిబర్లు పెరిగారు. కానీ మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు బాగా నష్టపోయాయి.
అతిపెద్ద సింగిల్ డే లాస్..
ఈ ఏడాది జనవరి 20 న దేశంలో మొదటి కరోనా కేసును గుర్తించారు. కేసులు వేగంగా పెరగడంతో పాటు, కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ను విధించడంతో స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. మార్చి 23 న సెన్సెక్స్ ఏకంగా 3,935 పాయింట్లు పతనమయ్యి 25,639 వద్ద మూడేళ్ల కనిష్టాన్ని నమోదు చేసింది. నిప్టీ 1,135 పాయింట్లు నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద నాలుగేళ్ల కనిష్టాన్ని తాకింది. ఈ సెషన్‌లో స్టాక్ ఇండెక్స్‌లు తమ అతిపెద్ద సింగిల్ డే లాస్‌లను నమోదు చేశాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మార్కెట్లు తిరిగి కొత్త రికార్డులను కూడా టచ్ చేయగలిగాయి. బుధవారం(డిసెంబర్ 30) సెషన్‌లో 47,808 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది మార్కెట్లోకి భారీగా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి.
అతిపెద్ద సింగిల్ డే లాస్..
ఈ ఏడాది జనవరి 20 న దేశంలో మొదటి కరోనా కేసును గుర్తించారు. కేసులు వేగంగా పెరగడంతో పాటు, కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ను విధించడంతో స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. మార్చి 23 న సెన్సెక్స్ ఏకంగా 3,935 పాయింట్లు పతనమయ్యి 25,639 వద్ద మూడేళ్ల కనిష్టాన్ని నమోదు చేసింది. నిప్టీ 1,135 పాయింట్లు నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద నాలుగేళ్ల కనిష్టాన్ని తాకింది. ఈ సెషన్‌లో స్టాక్ ఇండెక్స్‌లు తమ అతిపెద్ద సింగిల్ డే లాస్‌లను నమోదు చేశాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మార్కెట్లు తిరిగి కొత్త రికార్డులను కూడా టచ్ చేయగలిగాయి. బుధవారం(డిసెంబర్ 30) సెషన్‌లో 47,808 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది మార్కెట్లోకి భారీగా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి.
ఐపీఓ మార్కెట్ సూపర్ హిట్
ఈ ఏడాది ఐపీఓ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు వచ్చిన ఐపీఓలు పెద్దగా రాణించనప్పటికీ ఆ తర్వాత వచ్చిన కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్(ఐపీఓ) ఇన్వెస్టర్లను మెప్పించాయి. ఇండియన్ ఐపీఓ మార్కెట్ రూ. 30 వేల కోట్లను సమీకరించగలిగింది. కంపెనీలు బంపర్ లిస్టింగ్‌లను చూశాయి. ఈ ఏడాది బర్గర్ కింగ్, మిసెస్ బెక్టార్స్ ఫుడ్ స్పెషాలిటీష్, గ్లాండ్ ఫార్మా, కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్, రూట్ మొబైల్స్, హ్యాపియెస్ట్ మైండ్స్, రోసారి బయోటెక్‌ల ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ రావడంతో పాటు, ఈ షేర్లు 50 శాతానికి పైగా లాభాలతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.
వీరి చుట్టే ట్విటర్..
సోషల్ నెట్‌వర్క్ ట్విటర్ ఈ ఏడాది కొంత మంది ప్రముఖుల చుట్టు బాగా తిరిగింది. ట్విటర్‌లో బాగా పాపులరైన వ్యక్తుల్లో ప్రధాని మోడీ ఏడో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉండగా, ఆ తర్వాత ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్ నిలిచారు. వీరి తర్వాత అమెరికన్ పోలీసుల చేతిలో మరణించిన ఆఫ్రికన్–అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఉన్నారు. ఈయన మరణం తర్వాత యూఎస్ పోలీసులపై ఆ దేశం మొత్తం మీద నిరసనలు పెరిగాయి. ముఖ్యంగా ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమం ప్రపంచం మొత్తం తాకింది. విమాన ప్రమాదంలో చనిపోయిన కోబె బ్రెయంట్ నాలుగో ప్లేస్‌లో, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఐదో ప్లేస్‌లో ఉన్నారు. కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ ఆరో ప్లేస్‌లో నిలిచింది.
టిక్‌టాకే పాపులర్..
ఈ ఏడాది వరల్డ్ వైడ్‌గా ఎక్కువగా డౌన్‌లోడ్ అయిన యాప్‌లలో షార్ట్ కంటెంట్ వీడియో యాప్ టిక్‌టాక్ ముందుంది. ఏప్రిల్ మినహాయిస్తే జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా ఈ యాప్‌నే డౌన్‌లోడ్ చేసుకున్నారు. లాక్‌డౌన్‌లతో జూమ్ యాప్‌కు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరిగాయి. మరోవైపు బాగా పాపులరయిన టిక్‌టాక్ యాప్‌ను ఈ ఏడాది ఇండియన్ గవర్న్‌మెంట్ బ్యాన్ చేసింది. దీంతో పాటు మరో 200 చైనీస్ యాప్‌లను కూడా ప్రభుత్వం బ్యాన్ చేసింది. దేశ రక్షణపై ప్రభావం చూపుతున్నాయని వీటిపై నిషేధం విధించారు. ఇందులో టిక్‌టాక్, షేరిట్, యూసీ బ్రౌజర్ వంటి పాపులర్ యాప్‌లున్నాయి.
For More News..
నీతి ఆయోగ్ న్యూఇయర్ ప్లాన్స్
రోహిత్ ఆడాలంటే మరోకరిపై వేటు పడాల్సిందే..
