Tool gadgets : ప్రెజర్ చెక్

బైక్​ నడుపుతున్నప్పుడు చాలామందికి టైర్​లో గాలి తక్కువగా ఉందేమో అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు పంచర్​ షాప్​కు వెళ్లి చెక్​ చేసుకుంటే సరిగ్గానే ఉంటుంది. కొన్నిసార్లు తక్కువగా అనిపించకపోయినా తగ్గిపోతుంటుంది. అలా ఎయిర్​ ప్రెజర్​ని సరిగ్గా అంచనా వేయలేని వాళ్ల కోసమే ఈ గాడ్జెట్​. ఈ టైర్​ ప్రెజర్​ చెకర్​ని వన్​లాప్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీన్ని టైర్ నాజిల్​కు కనెక్ట్​ చేయగానే ప్రెజర్​ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే అవుతుంది. దీనికి జింక్ అల్లాయ్ మెటల్ హెడ్ - ఉండడం వల్ల లీకేజీ లేకుండా టైర్ నాజిల్‌‌‌‌‌‌‌‌కు సరిగ్గా ఫిక్స్​ అవుతుంది. 

ఈ గాడ్జెట్​ని మన్నికైన మెటీరియల్​తో తయారుచేశారు. డిజైన్  కూడా చాలా బాగుంటుంది. చిన్నగా ఉండడంతో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇది బ్యాక్‌‌‌‌‌‌‌‌లిట్ ఎల్​సీడీ డిస్‌‌‌‌‌‌‌‌ప్లేతో వస్తుంది. పగటి పూట కూడా నెంబర్లు బాగా కనిపిస్తాయి. దీనిలోని సెన్సర్ ప్రెజర్​ని చాలా ఆక్యురేట్​గా మెజర్​ చేస్తుంది. ఇది రెండు ఎల్​ఆర్​44 బటన్​ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇందులో ఆటో పవర్ కట్ ఫీచర్​ కూడా ఉంది. వాడకుండా పక్కన పెడితే 30 సెకన్లలో ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా షట్ డౌన్ అవుతుంది. ఇది బైక్​లకే కాదు ట్రక్కులు, స్కూటర్లు కార్లు.. ఇలా అన్నింటికీ ఉపయోగపడుతుంది. 
ధర:799 రూపాయలు

బ్రేక్ లైట్లు

సాధారణంగా బైక్​ మీద వెళ్తున్నప్పుడు బ్రేక్​ వేస్తే బ్యాక్​ లైట్​ వెలుగుతుంది. దాంతో వెనక వస్తున్న వెహికల్​ డ్రైవర్​ అలర్ట్​ అవుతాడు. అయితే.. ఆ లైట్​ చీకట్లో బాగానే కనిపిస్తుంది. కానీ.. డే టైంలో సరిగ్గా కనిపించదు. అందుకే అదనంగా ఇలాంటి బ్రేక్​ లైట్లను బిగించుకుంటే సరిపోతుంది. ఈ లైట్లను రామంతా అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఇవి బైక్​లో ఉండే బ్యాటరీతోనే పనిచేస్తాయి. వీటికి 12 వోల్ట్స్ డీసీ పవర్​ సరిపోతుంది. బ్రేక్​ వేయగానే ఈ లైట్లు ఫ్లాష్​ అవుతాయి. వీటిని టర్న్ సిగ్నల్ లైట్లు, రివర్సింగ్ లైట్లు, కార్నర్ లైట్లు, పార్కింగ్ లైట్లలా కూడా వాడుకోవచ్చు. ఇందులో మూడు ఫ్లాషింగ్​ ప్యాట్రెన్స్​ ఉంటాయి. ఇన్​స్టాల్​ చేయడం కూడా ఈజీ. 

రెండు లైట్ల ధర : 189 రూపాయలు

హ్యాండిల్​ గార్డ్​

వానాకాలంలో బైక్​లు స్కిడ్​ అవుతుంటాయి. బాడీ అంతటా కాకపోయినా చేతులు కాళ్లకు మాత్రం గాయాలు అవుతాయి. ఇలాంటి హ్యాండిల్​ గార్డ్స్​ని బిగించుకుంటే కనీసం చేతులనైనా కాపాడుకోవచ్చు. వీటిని ఒటోరాయ్స్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. వీటిని బిగించుకుంటే ముఖ్యంగా వేళ్లను కాపాడుకోవచ్చు. యమహా, సుజుకి, హీరో, హోండా లాంటి అన్ని బైక్​లకు సరిపోతుంది. దీన్ని ప్లాస్టిక్, అల్యూమినియం అల్లాయ్​తో తయారుచేశారు. ఇవి బిగిస్తే బైక్​ లుక్​ కూడా బాగుంటుంది.

డిస్క్​ లాక్

పబ్లిక్​ పార్కింగ్​ జోన్లలో బైక్​ పార్క్ చేసినప్పుడు ఎవరో ఒకరు బైక్​ని పక్కకి జరుపుతుంటారు. దాని వల్ల చిన్న చిన్న డ్యామేజ్​లు కూడా అవుతుంటాయి. కానీ.. ఇలాంటి డిస్క్​లాక్​లు వేస్తే బైక్​ అడుగు కూడా జరగదు. దీన్ని వీల్​కు ఉండే డిస్క్ రంధ్రాలకు ఎటాచ్​ చేసి వేసుకోవచ్చు. దీనికి అలారం సిస్టమ్​ కూడా ఉంది. బైక్​ని ఎవరైనా కదిలిస్తే వెంటనే అలారం మోగుతుంది.

 దీని అలారం110dB వరకు వినిపిస్తుంది. కాబట్టి దొంగలకు బైక్​ని కొట్టేసే అవకాశం ఇవ్వదు.ఈ యాంటీ–థెఫ్ట్ డిస్క్ లాక్​ని వాటర్​ రెసిస్టెంట్​ టెక్నాలజీతో తయారుచేశారు. కాబట్టి వానలో పార్క్​ చేసినా సమస్య ఉండదు. హై సెక్యూరిటీ యాంటీ-డ్రిల్ లాక్ కోర్ ఉండడం వల్ల లాక్​ని పగులగొట్టడం, కట్​ చేయడం లాంటివి చేయలేరు. ఈ లాక్‌‌‌‌‌‌‌‌లో ఇన్​బిల్ట్​ షాక్ సెన్సర్ ఉంది. ఇది వైబ్రేషన్లు, కదలికలను గుర్తించగలదు. 

 ధర : 729 రూపాయలు