చాక్లెట్ శాండ్ విచ్ చూసి ఆశ్చర్యపోయిన ఒమర్ అబ్దుల్లా

చాక్లెట్ శాండ్ విచ్ చూసి ఆశ్చర్యపోయిన ఒమర్ అబ్దుల్లా

శాండ్ విచ్ ను తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వివిధ రకాల్లో.. వివిధ ఆహార పదర్థాలను ఉపయోగించి వీటిని తయారు చేస్తుంటారు. నోరూరించే శాండ్ విచ్ లను చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. లోట్టలు వేసుకుని తింటారు. కానీ ఓ శాండ్ విచ్ తయారీ చూసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరన్స్ పార్టీ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను ఆయన రీ ట్వీట్ చేశారు. ఇది నా మనస్సును కదిలించి వేసిందని, దీనిని ఎలా కనుగొన్నారు ? శాండ్ విచ్ తయారీకి ఉపయోగించిన పదార్థాలను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలిపారు. గుజరాతీ ఫుడ్ ను ఇష్టపడుతానని వెల్లడించారు. 

శాండ్ విచ్ ఎలా తయారు చేశారు ? 
రెండు బ్రెడ్ ముక్కలను తీసుకుని ‘లవ్’ సింబల్ లా కట్ చేశారు. దానిపై వివిధ రకాల క్రీములను రాశారు. తర్వాత డెయిరీ మిల్క్ కంపెనీకి చెందిన రెండు చాక్లెట్ లను తీసుకుని దానిని పొడిగా చేశారు. ఈ పొడిని ఓ బ్రెడ్ ముక్కపై వేశారు. దానిపై ఛీజ్.. ముక్కలుగా కట్ చేసిన రెండు ఐస్ క్రీమ్ లను దానిపై పెట్టారు. ఇతర బ్రెడ్ ముక్కను దానిపై పెట్టారు. దానిని కట్ చేసి ఓ ప్లేట్ లో పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.