డీజే, ఆల్కహాల్ లేకుండా పెళ్లి చేసుకుంటే రివార్డు: గ్రామపంచాయతీ తీర్మానం

  • 21 వేలు ఇస్తామని పంజాబ్​లోని గ్రామపంచాయతీ తీర్మానం 

చండీగఢ్: డీజే మ్యూజిక్, ఆల్కహాల్ లేకుండా పెండ్లి చేసుకుంటే రివార్డును అందజేయాలని పంజాబ్ భఠిండా జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ తీర్మానించింది. రూ. 21 వేలను నగదు ప్రోత్సహకంగా ఇయ్యాలని నిర్ణయించింది. ఐదు వేల మంది జనాభా ఉన్న బల్లో గ్రామం ఈ తీర్మానం చేసింది.

పెళ్లిళ్లలో మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బల్లో గ్రామసర్పంచ్ అమర్ జీత్ కౌర్ తెలిపారు. గ్రామాల్లో వివాహా వేడుకల సందర్భంగా డీజేలను ప్లే చేయడం, ఆల్కహాల్ ను అందుబాటులో ఉంచడంతో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. డీజే మ్యూజిక్ తో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. పెళ్లిళ్ల సందర్భంగా వృథా ఖర్చులు చేయకుండా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.