బోర్డు పెట్టేసిన పోలీసులు : స్మోర్ట్ ఫోన్ జాంబీస్ ఉన్నారు జాగ్రత్త

బోర్డు పెట్టేసిన పోలీసులు : స్మోర్ట్ ఫోన్ జాంబీస్  ఉన్నారు జాగ్రత్త

ఇపుడంతా స్మార్ట్ ఫోన్ మాయలో కొట్టుమిట్టాడుతోంది ప్రపంచం.  స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో భాగం కాదు..కొందరికి స్మార్ట్ ఫోనే జీవితమైపోయింది.  జేబులో డబ్బుల్లేకుండా మనిషి ఉంటాడేమో కానీ..ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండడం లేదు. తెల్లవారు జాము నుంచి రాత్రి పడుకునే ముందు వరకు స్మార్ట్ ఫోన్ చూడనిదే నిద్రపోరు. కూర్చున్నా..తింటున్నా..పడుకున్నా..డ్రైవింగ్ చేస్తున్నా..ఇలా ప్రతి క్షణం ఫోన్ వాడుతూనే ఉంటారు.  ఒక్క క్షణం ఫోన్ యూజ్ చేయకుండా..వాటికి దూరంగా ఉండలేరు.

 స్మార్ట్ ఫోన్ లేకపోతే కొందరు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడకం వల్ల కొందరి జీవితాలు, కాపురాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. అంతగా అడిక్ట్ అవుతున్నారు స్మార్ట్ ఫోన్ కు.  ఒక విధంగా చెప్పాలంటే ఇదొక రకమైన వ్యాధిలా తయారయ్యింది. మనిషి పక్కన ఉన్నా ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఒక విధంగా చెప్పాలంటే..మనిషి ఉన్నా లేనట్టే..అంటే జాంబీస్ లాగా అన్న మాట.  స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.. అవసరం మేరకే ఫోన్ వాడాలి. లేదంటే ప్రమాదానికి దారితీస్తుంది.
 
 లేటెస్ట్ గా బెంగళూరు పోలీసులు స్మార్ట్ ఫోన్ ఫోబియా నుంచి బయటపడేందుకు విన్నూతంగా అవగాహన కల్పిస్తున్నారు. విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ వాడే వారిని ఉద్దేశిస్తూ హెచ్చరిక బోర్టులు పెడుతున్నారు.  స్మార్ట్ ఫోన్ ఒక జాంబీలా మారింది జాగ్రత్త అంటూ బోర్టు పెట్టారు..ఇది ఇపుడు  వైరల్ గా మారింది.   ఎక్కువగా ఫోన్ కు అడిక్ట్ అయిన వాళ్లు.. ఫోన్ లో అతిగా నిమగ్నమైన వాళ్లను జాంబీస్ తో పోల్చారు. ఫోన్ కు  అడిక్ట్ అయిన వాళ్లు పక్కనున్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉంటారు.. వీళ్లు వారికే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదాలు తెస్తారు.  ఈ క్రమంలో స్మార్ట్ జాంబీస్ ఉన్నారు జాగ్రత్త అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు పోలీసులు.. ఈ బోర్టు చూసిన వారంతా కరెక్టేనని కామెంట్ చేస్తున్నారు. ఈ రకమైన బోర్డులు పెట్టడంపై మద్దతిస్తున్నారు. 

ఈ బోర్టుపై నెటిజన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.  కొందరు బిజీగా ఉన్న రోడ్లపై కూడా స్మార్ట్ ఫోన్ చూస్తు నడుస్తారు. కొందరు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ లు వాడుతారు. రోడ్డు దాటేటప్పుడు ఫోన్ లో నిమగ్నపోతారు. ఇలా కొన్ని సెకన్ల పాటు కూడా స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేని స్థితిలో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.