మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..

మీరు KYC అప్ డేట్ చేసుకున్నారా.. చేసుకోకుంటే వెంటనే చేయించండి. లేదంటే మీ కార్డులు పనిచేయవు. 2025, జనవరి 20 లోపు చేయించకపోతే ఇక అంతే సంగతులు. మళ్లీ బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.  ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఇలా అన్ని కార్డులను KYC చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది.

ఆన్ లైన్ పేమెంట్స్.. కార్డ్ పేమెంట్స్.. వచ్చిన తర్వాత కస్టమర్స్ భద్రతకు ఎలాంటి గ్యారంటీ లేకుండా పోయింది. ఒక్క బ్యాంకుకు లేదా ఏదైనా వెబ్ సైట్ కు మీ డీటైల్స్ ఇచ్చారనుకోండి.. అది అన్ని రకాల కంపెనీలకు వెళ్లిపోతుంది. వివిధ IP Address ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తుంటారు. మీ కార్డు నెంబర్లు, మీ పర్సనల్ డీటైల్స్, ప్రజెంట్ వర్కింగ్ డీటైల్స్.. మీ ట్రాంన్జాక్షన్స్. ఇలా ప్రతీది కంపెనీలకు వెళ్లిపోతుంది. దీంతో రోజుకో అన్ వాంటెడ్ కాల్ రావడం.. మీకు ఆ ఆఫర్ ఉంది.. ఈ ఆఫర్ ఉంది.. అని చెప్పి ఓటీపీ చెప్పమని.. డీటైల్స్ చెప్పమని అకౌంట్లో ఉన్న డబ్బులు గుట్టు చప్పుడు కాకుండా కొట్టేయడం చూస్తూనే ఉన్నాం. రోజుకు వేల సంఖ్యలో కేసులు బుక్ అవుతున్నాయి. 

అలా జరగకూడదంటే కార్డులను మాస్కింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే KYC చేసుకుంటే కార్డులను మాస్కింగ్ చేసేస్తారు. ఆధార్, ఓటర్, పాన్ కార్డుల లాంటి అన్ని రకాల కార్డులను మాస్కింగ్ చేస్తారు. 

మాస్కింగ్ అంటే ఏంటి?

కార్డులను మాస్కింగ్ చేయడం అంటే KYC చేసిన తర్వాత కార్డు డీటైల్స్ ఎవరికి పడితే వారికి యాక్సెస్ చేసుకోవడానికి వీలుండదు. మనకు తెలియకుండా ఎవరు పడితే వారు మన డాటా తీసుకోలేరు. అందుకోసం కార్డులను మాస్కింగ్ చేస్తారు. అంటే కార్డు చివరి నాలుగు డిజిట్లు లేదా అంకెలు మాత్రమే కనిపించేలా మాస్క్ చేస్తారు. ఏ కార్డు అయినా చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా చేయడం వలన డాటా చోరీ జరగదు. దీంతో సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు తగ్గిపోతాయి. 

KYC మాస్కింట్ మనకు ఎలా ఉపయోగపడుతుంది

KYC మాస్కింగ్ 2025, జనవరి 20 నుండి అమలు చేస్తారు. KYC డాక్యుమెంట్లలోని సెన్సిటివ్ సమచారాన్ని మాస్క్ చేస్తారు. ఈ ఫీచర్ వలన చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. పౌరులు సెక్యూరిటీ, ప్రైవసీ పెంచడమే దీని ముఖ్య ఉంద్దేశం.

Also Read :- మందు మానేయటం కంటే.. మితంగా తాగితేనే బెటర్

సెంట్రల్ KYC రికార్డ్ రిజిస్ట్రీ (CKYCRR) నూతన మాస్కింగ్ సిస్టమ్ ను రూపొందించింది. ఈ నూతన విధానం ప్రకారం రిజిస్టర్ చేసుకున్న కొని సంస్థలు (Registered Reporting Entities - REs) మాత్రమే చివరి నాలుగు డిజిట్స్ ను చూసే వీలుంటుంది. 2025, జనవరి 20 నుంచి కొన్ని ప్రత్యేక సంస్థలు అంటే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర సేవలు అందించే సంస్థలు (REs) మాత్రమే చూసే వీలుంటుంది. దీనికోసం 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సిస్టమ్ అంటుంది. అంటే సంస్థలు ఆథెంటికేట్ చేసుకొని మాస్క్ చేసిన డాటా లేదా రికార్డ్ లో ఉన్న డాటాను డౌన్ లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీని వలన యూజర్ల భద్రత, గోప్యతకు ఎలాంటి భంగ కలగకుండా ఉంటుంది. 

అయితే ఇప్పటి వరకు ఈ సంస్థలు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి KYC ని సేకరించే వారు. లేదంటే కేవైసీ సేకరణకు థర్డ్ పార్టీ ఔట్ సోర్సింగ్ ప్రొవైడర్లపై ఆధారపడేవారు. ఈ థర్డ్ పార్టీలు తమ సొంత ఐపీ అడ్రెస్ లను వినియోగించి KYC డాటాను స్టోర్ చేసుకోవడం, వేరే వ్యాపార, వాణిజ్య సంస్థలకు అమ్ముకోవడం లాంటివి చేసేవి. ఈ చర్యలను నియంత్రించేందుకు KYC మాస్కింగ్ మార్గదర్శకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.   అయితే సంస్థలు (REs) దీనికోసం కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇంతకు ముందు 2024, డిసెంబర్ నెలాఖరు వరకు డెడ్ లైన్ ఇచ్చారు. అయితే వివిధ సంస్థల నుంచి అభ్యర్థనల మేరకు ఈ గడువు 2024, డిసెంబర్ 16 నుంచి 2025, జనవరి 20 సాయంత్రం 8.00pm వరకు పొడిగించారు.