టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా మార్కెట్లోకి తన ఫ్లాగ్షిప్ మల్టీపర్పస్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా లీడర్షిప్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇది 2.4 లీటర్ బీఎస్–6 డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఏడు సీట్లు, డాపర్ డ్యూయల్ టోన్ బాడీ, 4 కెమెరాలు, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్ షోరూం ధరలు రూ.21.21 లక్షల నుంచి మొదలవుతాయి.
