రక్తం శుద్ధిచేసే ఫిల్టర్​

రక్తం శుద్ధిచేసే ఫిల్టర్​

న్యూఢిల్లీ:  బయోకాన్‌‌‌‌ సబ్సిడరీ బయోకాన్ బయోలాజిక్స్‌‌‌‌ తీసుకొచ్చిన బ్లడ్‌‌‌‌ ప్యూరిఫికేషన్ డివైజ్‌‌‌‌ సైటోసార్బ్‌‌‌‌ను క్రిటికల్ కరోనా పేషెంట్ల ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వాడుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌‌‌‌లో అడ్మిట్ అయిన కరోనా పేషెంట్లలో ప్రో ఇన్‌‌‌‌ఫ్లమేటరీ సైటోకిన్స్ లెవెల్స్‌‌‌‌ను తగ్గించేందుకు తమ బ్లడ్‌‌‌‌ ప్యూరిఫికేషన్ డివైజ్  సైటోసార్బ్‌‌‌‌ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ డివైజ్‌‌‌‌కు  డీసీజీఐ నుంచి అనుమతి వచ్చినట్టు  పేర్కొంది. 18 ఏళ్లు, ఆ పైబడిన కరోనా పేషెంట్లకు ఎమర్జెన్సీలో సైటోసార్బ్‌‌‌‌ను వాడుకునేందుకు లైసెన్స్ కూడా కంపెనీకి దక్కింది. ఈ లైసెన్స్‌‌‌‌ కరోనా వైరస్ దేశంలో అదుపులోకి వచ్చేంత వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ అనుమతి కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ఇండస్ట్రీ, రెగ్యులేటరీలు కలిసి ఎలా ఫిజిషియన్లకు కొత్త ట్రీట్‌‌‌‌మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయనే దానికి ఉదాహరణగా నిలుస్తోందని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ కిరణ్ మజుందర్ షా అన్నారు.

సైటోసార్బ్ అనే డివైజ్‌‌‌‌ను పరిస్థితి విషమించిన పేషేంట్లలో సైటోకిన్ లెవెల్స్‌‌‌‌ను తగ్గిస్తుంది. దీన్ని ఇండియాలో బయోకాన్ 2013లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్, సెప్‌‌‌‌సిస్ ట్రీట్‌‌‌‌మెంట్లలో చాలా మంది పేషెంట్లకు వాడారు. కరోనా పేషెంట్లలో సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు.. సైటోకిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్‌‌‌‌ అనేది ఆర్గాన్ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌కు, మరణానికి దారితీస్తుంది. సైటోసార్బ్ థెరపీ ద్వారా సైటోకిన్ లెవెల్స్‌‌‌‌ను తగ్గించవచ్చు. బ్లడ్ ప్యూరిఫికేష్ ద్వారా డెడ్లీ ఇన్‌‌‌‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌‌‌‌ను అరికట్టవచ్చు.  కరోనా పేషెంట్లకు ఎమర్జెన్సీగా సైటోసార్బ్‌‌‌‌ను వాడుకునేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేసన్‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌లోనే లైసెన్స్‌‌‌‌ను గ్రాంట్ చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు