కుక్క‌లా యాక్ట్ చేస్తూ.. నెల‌కు 6 ల‌క్ష‌లు సంపాదిస్తున్న యువ‌తి

కుక్క‌లా యాక్ట్ చేస్తూ.. నెల‌కు 6 ల‌క్ష‌లు సంపాదిస్తున్న యువ‌తి

పెద్ద పెద్ద‌ కార్పొరేట్ కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల్ని ప్ర‌చారం చేసేందుకు సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయ‌ర్స్ ను ఎంపిక చేసుకుంటాయి. అయితే అది అంత ఈజీ కాద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. 21 ఏళ్ల జీనా ఫిలిప్స్ సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయ‌ర్ లో కుక్క‌లా యాక్ట్ చేస్తూ నెల‌కు ఆరుల‌క్ష‌ల జీతం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.
మాజీ ఆప్టిషియన్ అయిన జీనా డాగ్ లా నేల‌పై రోల్ చేస్తూ బంతిని ప‌ట్టుకోవ‌డం ఇలాంటి ప‌నులు చేస్తూ పెద్ద‌మొత్తంలో సంపాదిస్తుంది. టిక్ టాక్ లో ల‌క్ష‌మంది ఫాలోవ‌ర్స్ ఉన్న జీనా..నెటిజ‌న్ల నుంచి పెద్ద‌మొత్తంలో వ‌సూలు చేస్తుంది. ఎవ‌రైనా త‌న వీడియోల్ని చూడాలంటే ప్రీమియం పే చేయాల్సి ఉంది. కేవ‌లం అలా వ‌చ్చిన ఆదాయం సుమారు నెల‌కు 6 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు తెలిపింది. ఇక డాగ్ లా యాక్ట్ చేస్తుండ‌డంతో తాను చేసే వీడియోల‌తో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఫుడ్ ప్రాడక్ట్ ప్ర‌చారానికి ఉప‌యోగించుకుంటున్నాయ‌ని చెప్పింది. టిక్ టాక్ లో కుక్కులా యాక్ట్ చేస్తూ వ్యూస్ తో డ‌బ్బులు సంపాదించ‌డంపై తాను ఆనందంగా ఉన్న‌ట్లు , ప్రీయ‌మం, అడ్వ‌టైజ్ మెంట్ల‌తో క‌లిపి సుమారు సంవత్స‌‌రానికి రూ.95ల‌క్ష‌లు సంపాదిస్తున్న‌ట్లు ఫిలిప్స్ వెల్ల‌డించింది. ప్రారంభంలో పార్ట్ టైం గా వీడియోలు చేసిన‌ట్లు తెలిపిన జీనా..పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు రావ‌డంతో ఫుల్ టైమ్ వీడియోలు చేస్తున్న‌ట్లు చెప్పింది.