SA vs SL: ట్రోలింగ్‌కు చెక్.. సెంచరీతో జట్టును ఆదుకున్న బవుమా

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా  అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. డర్బన్‌లోని వేదికగా కింగ్స్‌మీడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 201 బంతుల్లో 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ సఫారీ కెప్టెన్ కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చాలా ఓపిగ్గా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 

బవుమాను చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చేస్తూ ఉంటారు. అతను ఆటకు పనికిరాడని.. కెప్టెన్సీ అనవసరంగా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అతను ఆడకపోతే ట్రోల్స్, మీమ్స్ చేయడానికి రెడీగా ఉంటారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో బవుమా చెత్త బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నిటికీ బవుమా చెక్ పెట్టాడు. రెండు ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడుతూ కెప్టెన్సీకి తాను అర్హుడేనని నిరూపించుకున్నాడు. 

ALSO READ | IND vs AUS: ఆస్ట్రేలియాలో అతనికి బౌలింగ్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తాను: సిరాజ్

బవుమాతో మరో ఎండ్ లో స్టబ్స్ సెంచరీ చేయడంతో సౌతాఫ్రికా శ్రీలంకకు భారీ స్కోర్ టార్గెట్ విధించే పనిలో ఉంది. మూడో రోజు లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 468 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో స్టబ్స్ (109), బవుమా (105) క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరగడంతో లంక ఆటగాళ్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  

42 పరుగులకే ఆలౌట్ కావడంతో కావడంతో తొలి ఇన్నింగ్స్ లో  సౌతాఫ్రికాకు 149 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకముందు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. కెప్టెన్ టెంబా బవుమా ఒక్కడే 70 పరుగులు చేసి రాణించాడు.