తాళం వేసిన ఇంట్లో 30 తులాల బంగారం చోరీ

కొల్లాపూర్, వెలుగు: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారు, 10 కేజీల వెండిని ఎత్తుకెళ్లారు.  నాగర్ కర్నూల్ జిల్లా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11వ తేదీన పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఎండీ శంషోద్దీన్  కుటుంబ సభ్యులు పనిమీద మహారాష్ట్ర వెళ్లారు.  మంగళవారం ఉదయం తాళం పగలగొట్టి ఉందని పక్కింటి వారు కుటుంబ సభ్యులకు  సమాచారం అందించారు.

కాగా ఇంటికి తిరిగి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు బంగారం, వెండి కలిపి దాదాపు రూ. 10 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు 
పేర్కొన్నారు.