వికారాబాద్ జిల్లాలోని టీచర్స్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే వీధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్ళే టార్గెట్ గా దొంగతనాలు చేశారు. నాలుగు ఇళ్ళల్లో కలిపి పదివేలు రూపాయలు నగదు చోరీ చేయగా బంగారం విలువ తెలియాల్సి ఉంది. మొదట మెయిన్ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దొంగలు.. దానికి సీక్రెట్ లాక్ ఉండటంతో డోర్ తెరుచుకోలేదు. బయటనుంచి కిటికీ వెంటిలేటర్ ను గడ్డపారతో పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాల డోర్లు పగలగొట్టి నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. సీసీ కెమరాల్లో దొంగల కదలికలు రికార్డు అయింది. వరుస చోరీలతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ వివరాలు తెలుసుకుంటున్నారు. వరుస చోరీలు జరిగిన పోలీసులు ఛేధించలేకపోతున్నారు. కాలనీలో పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు కాలనీవాసులు.
వికారాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం
- రంగారెడ్డి
- June 30, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.