పటాన్చెరులో పట్టపగలే చోరీ.. 7తులాల గోల్డ్, 50 తులాల సిల్వర్ అపహరణ

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. గోకుల్ నగర్ లోని బోడ బిక్షపతి యాదవ్ ఇంట్లో 7తులాలబంగారం, 50 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 

బాధితుడు బోడ బిక్షపతి అతని భార్య పోచమ్మ సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతాలో వావిలాలలో బంధువుల ఒకరు చనిపోతే అంత్య్ర క్రియలకు హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో దొంగల పడ్డారని గుర్తించారు. 

ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపించకుండా పోవడంతో పోలీసులకు  ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆద్వ్యంలో విచారణ చేస్తున్నారు.