చందాపూర్​ గ్రామంలో దొంగల హల్‌‌‌‌ చల్‌‌‌‌ ..  నాలుగు ఇండ్లలో చోరీ 

అచ్చంపేట, వెలుగు:  అర్ధరాత్రి నాలుగు ఇండ్లల్లో దొంగలు చోరీలకు పాల్పడిన సంఘటన అచ్చంపేట మండలం చందాపూర్​ గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేట మండలం చందాపూర్​ గ్రామంలో నర్సింహ్మ రెడ్డి అనే వ్యక్తి కొత్త ఇల్లు నిర్మించుకుంటుండగా అక్కడే నిద్రిస్తున్నాడు.

 పాత  ఇంటికి తాళం వేసి వెళ్లగా ఇంట్లో దొంగలు పడ్డారు.  బీరువా తాళం పగలగొట్టి రూ. 50 వేల నగదు, రెండు తులాల బంగారం, 15 తులాల వెండితో  పాటు ఇంటి ముందు ఉన్న  బైక్‌‌‌‌ ఎత్తుకెళ్లారు.  శ్రీను గౌడ్​, బాల్ రెడ్డి, నర్సిరెడ్డి ఇండ్లల్లో దొంగలు చోరీకి యత్నించారు. అచ్చంపేట సీఐ రవీందర్ , ఎస్​ఐ రాములు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.