ఇడ్లీ, దోశె, ఉప్మా.. బ్రేక్ పాస్ట్ లో మాత్రమే తింటారు చాలామంది. అయితే, వీటినే కొంచెం వెరైటీగా చేసుకుంటే సాయంత్రం స్నాక్ గా, డిన్నర్ ఐటమ్ కూడా తినొచ్చు. పైగా పిల్లలు కూడా ఇలాంటి కొత్త వంటకాలను ఇష్టంగా తింటారు. అలాంటివే ఇవి.
కావలసిన పదార్థాలు:
బ్రెడ్: 8 ముక్కలు, నూనె: 2 టేబుల్, కారం : ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి: అర టీ స్పూన్ జీలకర్ర: అర టీ స్పూన్, ఇంగువ: చిటికెడు, మినప్పప్పు : ఒక టీ స్పూన్ ఉల్లిపాయ తరుగు: అర కప్పు, టొమాటో కెచప్ : ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు : ఒక రెమ్మ, పసుపు: అర టీ స్పూన్ షుగర్: ఒక టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా
తయారీ
ముందుగా బ్రెడ్ ముక్కల అంచులు తీసేయాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి మినప్పప్పు, ఉల్లిపాయ తరుగు, ధనియాల పొడి, కారం, ఇంగువ వేగించాలి. ఇందులోనే టొమాటో కెచప్, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా బ్రెడ్ ముక్కలతో పాటు షుగర్ వేసి ఐదు నిమిషాలు వేగించాలి.