పిగ్లీపూర్‪లో ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో దాడి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 17 లో సీలింగ్ ల్యాండ్ లో అక్రమంగా వెంచర్ నిర్మాణం చేపడుతున్నారు.  రైతులకు అక్కడి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వెంచర్ నిర్వాహకులు రైతులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తమపై అటాక్​చేశాడని బాధితులు వాపోయారు. ఫోర్జరీ డాక్యుమెంట్ లను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని  పేర్కొన్నారు.

ALSO READ | పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే