కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు.

 అనంతరం గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేసి, ఒడిబియ్యం పోసి కోడేలు కట్టి స్వామివారిని దర్శించుకున్నారు.