ఉద్యమాన్ని ఆపేది లేదు: రాకేష్‌ తికాయత్‌

ఉద్యమాన్ని ఆపేది లేదు: రాకేష్‌ తికాయత్‌

ఉద్యమాన్ని ఆపేది లేదని BKU నేత రాకేష్‌ తికాయత్‌ మరోసారి తేల్చిచెప్పారు. తమను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. అవసరమైతే బుల్లెట్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అయినా ఇప్పటి వరకు ఘాజిపూర్‌లో అల్లర్లు జరగలేదని … అయినప్పటికీ ప్రభుత్వం తమను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్‌ తికాయత్‌.

రెండు నెలలకు పైగా ఉద్యమ పోరు సాగిస్తున్న అన్నదాతలపై  పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. వెంటనే సరిహద్దులను ఖాళీ చేసి వెళ్లాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబందించి వారికి నోటీసులు అందించారు. అంతే కాకుండా ఘాజిపూర్‌ దగ్గర 144 సెక్షన్‌ను విధించారు. అక్కడి సరిహద్దులను మూసివేశారు. రైతులను అక్కడి నుండి పంపించేసేందుకు రాఫిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగాయి. అంతేకాకుండా పలుమార్లు రైతులకు నీరు, విద్యుత్‌ సరఫరాను పోలీసులు నిలిపివేశారు. అయినప్పటికీ..తమ ఉద్యమాన్ని విరమించుకునేది లేదని స్పష్టం చేశారు.