వైద్యుల నిర్లక్ష్యం.. యువతి మృతి..మల్లారెడ్డి ఆసుపత్రిలో తీవ్రఉద్రిక్తత..మీడియాపై దాడి

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం( నవంబర్ 9) చికిత్స కోసం వచ్చిన యువతి వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణా లుకోల్పోయిందని ఆమె బంధులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే కవరేజ్ కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా మల్లారెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు దాడి చేశారు. దీంతో సూరారం పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 

మూడు రోజులక్రితం కిడ్నీలో రాళ్లు వచ్చాయని చికిత్సకోసం ఓ యువతి చేరింది. డాక్టర్లు ఆపరేషన్ చేయడంతో తీవ్రరక్తస్రావానికి గురై శనివారం మృతిచెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.