జియో నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ !

జియో నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ !

టెలికామ్ దిగ్గజ సంస్థ జియో కొత్త ఆండ్రాయిడ్ 5జీ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని ధర పదివేల రూపాయలలోపు ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్ సెట్ తో పనిచేస్తుంది. 6.5 ఇంచుల  డిస్ ప్లే, 13+2 ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ తో రాబోతోంది. అయితే, పదివేల రూపాయల ప్రైజ్ రేంజ్ లో మార్కెట్ లో చాలా రకాల ఫోన్స్ ఉన్నాయి. వాటిని తట్టుకొని ఈ రిలయెన్స్ జియో 5జీ ఫోన్ ఎలా నిలబడుతుందో చూడాలి.