గవర్నమెంట్ స్కూల్​కి టీచర్  కావలెను..

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని  జి బండతండా గవర్నమెంట్ స్కూల్​ ఇది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 13 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. గత విద్యా సంవత్సరం వరకు టీచర్ రవీందర్​నాయక్​ వీరికి పాఠాలు చెప్పేవారు.

ఉన్న ఒక్క టీచర్ ఇటీవల ప్రమోషన్ పై కొత్తపల్లికి వెళ్లడంతో.. 13 మంది విద్యార్థుల్లో ముగ్గురు మాత్రమే రోజూ బడికి వస్తున్నారు. సార్లు ఎవరూ రాకపోవడంతో ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు.

-  మరికల్​, వెలుగు