భారత్ లో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు

భారత్ లో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు

భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న(గురువారం) 87 కేసులు ఉండ‌గా  ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.  మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 32 కేసులు ఉండ‌గా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరింది.  రాజ‌స్థాన్‌లో 17, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో 8 కేసులు న‌మోద‌య్యాయి.  ఒమిక్రాన్ క‌ట్ట‌డికి అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అంద‌రూ త‌ప్ప‌కుండా కరోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్పారు.  

ఒమిక్రాన్‌ వేగంగా  వ్యాప్తి చెందుతోందని.. దీనిపై అప్రమత్తంగా ఉండాలి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేశామన్నారు లవ్ అగర్వాల్. అంతేకాదు.. అనవసర ప్రయాణాలు, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను సింపుల్ గా జరుపుకోవాలన్నారు.