డెడ్ బాడీ పై ఉన్న గోల్డ్ మాయం..!

గద్వాల, వెలుగు :  రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మెరిస్సా డెడ్ బాడీ పై ఉన్న గోల్డ్ కనిపించడం లేదని మృతురాలి బంధువులు టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కంప్లైంట్ చేశారు. మృతురాలి బంధువు భారతి వివరాల మేరకు.. గోన్పాడు గ్రామానికి చెందిన మేరీస్సా నిన్న మృతిచెందగా మార్చురీలో ఆమే డెడ్ బాడీని చూసేందుకు శుక్రవారం వెళ్లగా ఆమె ఒంటిపై ఉన్న రెండు పుస్తెలు, చెవి కమ్మలు, బంగారు గుండ్లు కనిపించలేదన్నారు. 

హాస్పిటల్ వారిని అడిగితే తమకేం తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. వార్డ్ బాయ్స్  డెడ్ బాడీ పై ఉన్న గోల్డ్ ను దొంగిలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. టౌన్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. టౌన్ ఎస్ఐ కళ్యాణ్ రావ్ ను వివరణ కోరగా గోల్డ్ పోయినట్లు ఫిర్యాదు చేశారని ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.