తిరుమల శ్రీవారి హుండీలో చోరీ.. నిందితుడి అరెస్ట్

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. గత శనివారం ( నవంబర్ 23, 2024 ) మధ్యాహ్నం తమిళనాడుకు చెందిన వ్యక్తి చోరీకి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీవారి హుండిలోని నగదు దొంగలించి వెళ్తున్న వ్యక్తి దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టిన విజిలెన్స్ అధికారులు అదే రోజు సాయంత్రం దొంగను పట్టుకున్నారు.

Also Read :- మహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్

దొంగను అదుపులోకి తీసుకున్న అధికారులు అతని దగ్గర నుండి రూ. 15వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్వామివారి భక్తులను షాక్ కి గురి చేసింది.