అందరూ కలవాల్సింది శ్రీతేజ్ను.. అల్లు అర్జున్ను కాదు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న శ్రీతేజ్ ను కలవకుండా అందరూ అల్లు అర్జున్ ను కలుస్తున్నారని, కానీ కలవాల్సింది, పరామర్శించాల్సింది శ్రీతేజ్ ను అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (నవీన్) అన్నారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంగళవారం ఆయన పరామర్శించారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ తేజ్ హెల్త్ కండిషన్ పై వైద్యులను అడిగి తెలుసుకున్నానని, కండిషన్ క్రిటికల్ గానే ఉందని తెలిపారు. శ్రీతేజ్  స్పృహలో లేడని, ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వైద్యులు అంటున్నా రని తెలిపారు. 

 అల్లు అర్జున్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా వాళ్లు బంద్ పెట్టాలని హెచ్చరించారు. పుష్ప2 సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయని, అందులో 10 శాతం అయినా శ్రీ తేజ్ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.