జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు

గద్వాల, వెలుగు : తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేసిన నీళ్లు గురువారం ఉదయం జూరాల డ్యామ్ కు చేరుకున్నాయి. మూడు రోజుల కిందట తెలంగాణ సర్కార్ వినతి మేరకు కర్ణాటక1.09 టీఎంసీల విడుదలకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయగా గురువారం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక నీళ్లు జూరాల ప్రాజెక్టుకు రావడంతో తాగునీటి గండం తప్పినట్లు అయిందని ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.