ఫెడ్ మీటింగ్‌పైనే ఫోకస్ అంతా!

ఫెడ్ మీటింగ్‌పైనే ఫోకస్ అంతా!

బుధవారం వెలువడనున్న ఫెడరల్ రిజర్వ్‌ పాలసీ డిటెయిల్స్‌
దేశ ఇన్‌ఫ్లేషన్ డేటా కూడా ఈ వారమే..

న్యూఢిల్లీ: యూఎస్ ఫెడ్ మీటింగ్ ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎక్కువగా ప్రభావితం చేయనుంది. లోకల్‌‌‌‌‌‌‌‌గా  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్  డేటా  సోమవారం విడుదల కానుండగా, హోల్‌‌‌‌‌‌‌‌ సేల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా బుధవారం వెలువడనుంది. ‘గ్లోబల్ అంశాల పరంగా చూస్తే ఈ వారం చాలా కీలకం. యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా, ఫెడ్ మీటింగ్ వివరాలు ఈ వారం వెలువడనున్నాయి’  అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. వీటికి అదనంగా చైనాకు సంబంధించిన వార్తలు, క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కదలికలను నిర్దేశించనున్నాయి.

విదేశీ ఇన్వెస్టర్ల  మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా గమనించాలని   ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు కిందటి వారంలో రూ.4,306 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. తాజా బుల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లీడర్ అయిన నిఫ్టీ బ్యాంక్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీ మీటింగ్ తర్వాత కూడా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా కదులుతోందని మీనా పేర్కొన్నారు. నిఫ్టీ బ్యాంక్ శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ముగియగా, సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీలు మాత్రం నష్టాల్లో ముగిశాయి.  ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా జరుగుతోందని ఎనలిస్టులు అన్నారు.