వెలుగు : అవసరాలు, ఆర్థిక భద్రత, సౌకర్యాలు లేదా కోరికలకు మీ బడ్జెట్ సరిపోవడం లేదా? మీరేకాదు ప్రతి భారతీయ కుటుంబం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. పిల్లల స్కూల్‌ఫీజులు, గ్రోసరీ, మెడికల్ ఇన్సూరెన్స్, హోమ్‌లోన్ ఈఎంఐ వంటి వాటిని తప్పించుకోలేము. రెస్టారెంట్లలో తినడం, షాపింగ్, కొత్త గ్యాడ్జెట్‌లను కొనడంవంటి లగ్జరీ ఖర్చులు పర్సును ఖాళీ చేసేస్తుంటాయి. మన బడ్జెట్‌లో వీటికి ఏ విధంగా కేటాయింపులు చేయాలి? దానికి సమాధానమే ఇది. ఫేమస్ రచయిత సెనేటర్ఎలిజబెత్వారెన్ రాసిన ‘ది అల్టిమేట్ లైఫ్‌టైం మనీ ప్లాన్’ బుక్‌లో 50/30/20 బడ్జెట్ రూల్‌ను పరిచయం చేశారు. దీనర్థం ఏంటంటే మన బడ్జెట్‌లో అవసరాలకు 50 శాతం, కోరుకున్నవాటికి 30 శాతం, సేవింగ్స్‌కు 20 శాతం కేటాయింపులు చేసుకోవాలి. కాగా ఈ రూల్ అంతర్జాతీయంగా పాపులర్ అయ్యింది. ఈ థంబ్ రూల్‌ప్రకారం ..
- ట్యాక్స్ తర్వాత మన ఆదాయంలో 50 శాతాన్ని మన అవసరాల కోసం వినియోగించాలి
- 30 శాతం మనీని లగ్జరీ అవసరాలు, వస్తువుల కోసం కేటాయించాలి
- మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను ఫైనాన్షియల్ గోల్స్ కోసం పొదుపు చేసుకోవాలి.
చూడడానికి సింపుల్‌గా కనిపిసున్నప్పటికి దీనిని అనుసరించడం చాలా కష్టం. అవసరాలను, లగ్జరీలను వేరుచేయడం అంత సులువుకాదు. దీనికి సంబంధించి ఒకే విధమైన డెఫినేషన్ ఉండదు. ఒకరికి అవసరం అనుకున్నది మరొకరికి లగ్జరీ అవుతుంది. మన ఆదాయం, బయట పరిస్థితులను అనుసరించి అవసరాలను, లగ్జరీల నుంచి వేరు చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఇన్వెస్టర్ల గోల్స్, తమ ఆదాయానికి అనుగుణంగా మంచి ఫైనాన్షియల్ ప్రణాళికను ఈ రూల్‌కు తోడుగా పాటించాలి. అందరికి తెలిసిన‘ఆదాయం మైనస్ ఖర్చులు= సేవింగ్స్ ’ సూత్రాన్ని ‘ఆదాయం మైనస్ సేవింగ్స్= ఖర్చులు’ గా మార్చుకోవాలి. లాంగ్‌టర్మ్ దృక్పథంతో ఉన్నవాళ్లు ఫైనాన్షియల్ ప్లాన్‌ను కచ్చితంగా అనుసరించాలి. అయినప్పటికి మన వాళ్లతో మంచి మెమరీస్‌ను కూడా కోల్పోకూడదు. దీనికి కొంత టైం, డబ్బు అవసరమవుతాయి. అందువలన లైఫ్‌లో మంచి మెమరీస్ కోసం ఖర్చు చేసే డబ్బుకు, భవిష్యత్ కోసం దాచే సేవింగ్స్‌కు మధ్య మంచి బ్యాలెన్స్‌ను కొనసాగించాలి.
