బర్త్ డే వేడుకల్లో విషాదం : కుక్క వెంట పడితే.. థర్డ్ ఫోర్ నుంచి దూకి చనిపోయాడు

హైదరాబాద్ లోని చందానగర్ లో బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెనాలికి చెందిన ఉదయ్(23) కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లోని వచ్చి రామచంద్రపురం అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఫ్రెండ్ బర్త్ డే వేడుకలను పిలిస్తే ఆదివారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ కు వెళ్లాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆదివారం చందానగర్ లోని వివి ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే.. విషాదం కుక్క రూపంలో కమ్ముకొచ్చింది. ఉదయ్ ఫ్రెండ్స్ తోపాటు థర్డ్ ఫోర్ లో ఉన్న హోటల్ రూంలో మద్యం సేవించాడు. ఉదయ్ కారిడార్ లోకి వెళ్లగానే.. అతని వెంట కుక్క పడింది. కుక్క తరమడంతో ఉదయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి కిటికీలోంచి కిందకి దూకేశాడు.

ఈ దృశ్యాలన్ని హోటల్లో ఉన్న సీసీకెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మద్య మత్తులో ఉన్న ఉదయ్ వారు ఉన్న రూమ్ థర్డ్  ఫోర్ లో ఉనందని మరిచిపోయాడు. కిటికీలోంచి దూకిన అతనికి తీవ్రంగా గాయాలు అయ్యారు. చికిత్స కోసం అతని ఫ్రెండ్స్ ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు అప్పటికే ఉదయ్ చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 20న రాత్రి జరగగా.. బయటకు తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అసలు హోటల్ థర్డ్ ఫోర్ లోకి కుక్క ఎలా వచ్చిందని అనుమానాలు రేకిత్తిడంతో పోలీసులు హాటల్ సీసీపుటేజ్ సేకరించారు. ఉదయ్ కారిడార్ లో నుంచి పరిగెత్తు కుంటూ వెళ్లి కిటికిలో నుంచి కిందకి దూకింది సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.