మూడో రోజు వానతో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-కివీస్ టెస్టులో మరో రోజు రద్దు

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోయిడా: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్టుకు ఏదీ అనుకూలించడం లేదు. మూడు రోజులు ముగిసినా  ఆట మొదలవలేదు. కనీసం టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పడలేదు. ముందు రోజుల్లో కురిసిన వర్షానికి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో  తొలి రెండు రోజుల ఆట రద్దవగా..  మూడో రోజు బుధవారం వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. వాతావరణం అనుకూలిస్తే  గురువారం 98 ఓవర్లు ఆడిస్తామని అఫ్గాన్ బోర్డు తెలిపింది. మొదటి రెండు రోజుల్లో  చుక్క వర్షం లేకపోయినా.. సిబ్బంది గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  పరిస్థితి చూస్తుంటే తర్వాతి రెండు రోజుల్లోనూ ఆట సాధ్యం అయ్యేలా లేదు. దాంతో మ్యాచ్ మొత్తం వర్షార్పణం అవుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.