డ్రగ్స్ తీసుకున్నవారికి.. ఎన్ని రోజుల్లోగా టెస్ట్ చేస్తే దొరికిపోతారు

ప్రస్తుతం రెండు తెలుగు రాష్టాల్లో డ్రగ్స్ భారీగా పట్టుపడుతున్నాయి. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అంతేకాదు తెలంగాణ పాలిటిక్స్ లో కూడా మాదకద్రవ్యాలు హాట్ టాపిక్ గా మారాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని సవాల్, ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. కేటీఆర్ బామ్మర్థి రాజ్ పాకాల ఫామ్ హౌజ్ పార్టీతో పొలిటికల్ లీడర్స్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు. 

కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు సై అంటే సై అని మీడియా ముందు డ్రగ్ టెస్టుల సవాల్ విసురుకున్నారు. ఈ క్రమంలో అసలు డ్రగ్స్ తీసుకున్న ఎన్ని రోజుల వరకు టెస్ట్ చేస్తే బట్టర్ రిజల్స్ట్ వస్తాయి? ఎన్ని రకాలుగా డ్రగ్స్ టెస్టులు చేయోచ్చొ ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్ టెస్టులు యూరిన్, హేయిర్, లాలాజలం, బ్లడ్, చెమట శాంపిల్స్ సేకరించి చేస్తారు. మద్యం సేవించిన వారికి బ్రీత్ ఎనలేజర్ టెస్ట్ చేస్తే 12- నుంచి 24 గంటల్లో దొరికిపోతారు. 

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం :

  • హెరాయిన్, ఆక్సికోడోన్ వంటి ఓపియాయిడ్లు చివరిసారిగా ఉపయోగించిన తర్వాత 3 రోజుల వరకు మానవ శరీరంలో డిటెక్ట్ చేయవచ్చు.
  • కొకైన్, మెత్, ADHD డ్రగ్స్  దాదాపు 2 లేదా 3 రోజుల వరకు గుర్తించవచ్చు.
  • బెంజోడియాజిపైన్స్, MDMA  వాడిన వారి యూరిన్ లో 4 రోజుల వరకు గుర్తించవచ్చు.
  • గంజాయి శరీరంలో  కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. చివరి ఉపయోగం తర్వాత 7రోజుల వరకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. 
  • బార్బిట్యురేట్స్, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ సాధారణంగా చివరి వాడకం నుంచి 3 వారాల వరకు మూత్రంలో గుర్తించబడుతుంది.

గంజాయి:

డ్రగ్స్ చాలా రకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు గంజాయి విరివిగా పట్టుపబడుతుంది. గంజాయి తీసుకునే వారిన మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. నార్మల్ యూజ్, డైలీ యూజ్, లాంగ్ టర్మ్ యూజ్ ఇలా డివైడ్ చేసి.. ఎప్పుడో  ఓసారి తీసుకుంటే.. గంజాయి తీసుకున్న రోజు నుంచి 3 రోజుల మధ్యలో టెస్ట్ చేస్టే రిజల్ట్స్ వస్తోంది. రోజూ గంజాయి తీసుకునే వారికి మానేశాక.. 5 నుంచి 10రోజులు మధ్యలో డ్రగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. కొన్ని నెలలుగా తీసుకుంటున్న వారికి అది మానేశాక 30 రోజుల వరకు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తోంది.

మెథాంఫేటమిన్:  

డ్రగ్ అవశేశాలు 2-4 రోజులు వరకు శరీరంలో ఉంటాయి. ఇది తీసుకుంటే 24 రోజుల వరకు పాజిటీవ్ రిజల్ట్స్ వస్తాయి.

PCP(ఫెన్సైక్లిడిన్): 

దీన్ని ఏంజెల్ డస్ట్‌ అని కూడా పిలుస్తారు. రోజువారీ వినియోగించే వారిలో ఈ టెస్ట్ 2-7 రోజుల వరకు ఫలితాన్ని చూపిస్తోంది. నెలలు, సంవత్సరాలుగా తీసుకునే వారికి డ్రగ్ తీసుకోవటం మానేసిన 30 రోజుల దాకా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి.

కొకైన్ తీసుకున్న 3 రోజుల్లోగా  ఆ వ్యక్తికి టెస్ట్ చేయాలి.

Note : ఏ డ్రగ్స్ తీసుకున్నా.. హేయిర్ (వెంట్రుకల నుంచి శాంపిల్స్) ఫొలికల్ టెస్ట్ చేస్తే 3 నెలల వరకు గుర్తించవచ్చు. 

క్రోమోటో గ్రఫీ టెస్ట్

క్రోమోటో గ్రఫీ ద్వారా కూడా డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించవచ్చు. బ్లడ్ శాంపిల్ తో దీన్ని  ఈ టెస్ట్ చేస్తారు.  క్రోమోటోగ్రఫీ అంటే మిక్సిడ్ కెమికల్స్ విభజించే ప్రక్రియ. ఏదైనా మిశ్రమంలో మరో రసాయనం కలిస్తే దాన్ని తెలుసుకునేందుకు ఇథనాల్ ఉపయోగిస్తారు. సూక్ష్మమిశ్రమాన్ని కూడా ఈ క్రోమోటోగ్రఫీ ఇట్టే పసిగట్టేస్తుంది. బ్లడ్‌లో మరో కెమికల్ రవ్వంత కలిసినా క్రోమోటోగ్రఫిలో ఉపయోగించే పేపర్ గ్రీన్ కలర్‌గా మారుతుంది. వెంటనే అప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారిస్తారు. నెలలు, సంవత్సరాలు క్రితం డ్రగ్స్ తీసుకున్నా.. కనిపెట్టేస్తోంది. ఈ టెస్టుకు అయ్యే ఖర్చు ఎక్కువ. క్రోమోటో గ్రఫీ టెస్ట్ చేయించోవాలంటే కోర్టు అనుమతి పక్కా.