KTRకు వారం రోజుల ఊరట.. విచారణ చేసుకోండి.. అరెస్ట్ అప్పుడే : హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది.  ఫార్ములా ఈ కార్ రేసు కేసులో  కేటీఆర్ ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది హై కోర్టు. అయితే ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని  చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్  క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టులో  పిటిషన్ వేశారు. 

డిసెంబర్ 20న  విచారణ సందర్బంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్ ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.కేసు కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను  తిరస్కరించింది. కేసులో విచారణకు ఎవరినైనా పిలవొచ్చని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు  వాయిదా వేసింది కోర్టు.

ఫార్ములా ఈ– కార్​ రేస్ వ్యవహారంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌  కేటీఆర్‌‌‌‌పై ఏసీబీ కేసు​ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎంఏయూడీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ దాన కిశోర్‌‌ ఫిర్యాదు మేరకు.. 13(1)(ఏ) రెడ్‌‌విత్‌‌, 13(2) ప్రివెన్షన్‌‌ ఆఫ్ కరప్షన్‌‌ యాక్ట్‌‌, 409 రెడ్‌‌విత్‌‌, 120(బి) ఐపీసీ సెక్షన్స్‌‌ కింద గురువారం ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌ చేసింది. రూ. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడి(ఏ1)గా కేటీఆర్​ను చేర్చింది. రెండో నిందితుడి(ఏ2)గా సీనియర్ ఐఏఎస్‌‌ ఆఫీసర్​ అర్వింద్​కుమార్‌‌‌‌, మూడో నిందితుడి(ఏ3)గా హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజనీర్‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని పేర్కొంది

 కేటీఆర్ తరపు  న్యాయవాది సుందరం వాదనలు

  • కేటీఆర్ పై ఏసీబీ తప్పుడు కేసు పెట్టింది..
  • రాజకీయ కుట్రలో భాగంగానే కేటీఆర్ పై  కేసు పెట్టారు
  • 14 నెలల తర్వాత కేసు పెట్టడం రాజకీయ కుట్ర
  • ప్రాథమిక దర్యాప్తు చేయందే ఎఫ్ఐర్ నమోదు చేశారు
  • అసలు కేటీఆర్ ఎలా లబ్ధి పొందారు
  • ఇది కరప్షన్ ఎలా అవుతుంది. సెక్షన్ 13(A) ఎలా వర్తిస్తుంది
  • రేస్ కోసం నిర్వాకులకు డబ్బులు పంపిస్తే కేటీఆర్ పై ఎందుకు కేసీఆర్ పెట్టారు
  • కేటీఆర్ పై పెట్టిన సెక్షన్లు చెల్లవు
  • ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి

అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు

  • FIR ద్వారానే దర్యాప్తు జరుగుతుంది
  • ప్రతి విషయం FIRలో ఉండదు
  • దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయి
  • ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంది
  • రెండు నెలల క్రితం MAUD చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారు
  • విచారణకు గవర్నర్ కూడా అనుమతించారు
  • దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని అడిగిన జడ్జి 
  • గవర్నర్ అనుమతి పత్రాలను పరిశీలిస్తున్న న్యాయమూర్తి
  • దర్యాప్తు లో భాగంగా  నిందితులు చాలా మంది యాడ్ అవుతారు 
  • ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే FIR నమోదు చేసాము అనేది అవాస్తవం 
  • ప్రాథమిక దర్యాప్తు జరిపాము
  •  అగ్రిమెంట్ లేకుండానే రెండు దఫాలు డబ్బులు పంపారు
  •  2023 అక్టోబర్ 3,11 తేదీల్లో డబ్బులు పంపారు   అప్పటికి అగ్రిమెంట్ లేదు
  • 2023 అక్టోబర్ 30 న రెండోవ అగ్రిమెంట్ చేసుకున్నారు 
  • డబ్బులు పంపింది రెండవ అగ్రిమెంట్ కోసమే 
  • మొదటి అగ్రిమెంట్ ను 2023 అక్టోబర్ 27 న రద్దు చేసుకున్నరు 
  • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు