సౌతాఫ్రికా, ఇండియా టీ20 సిరీస్ షూరు.. శాంసన్‌‌‌‌, అభిషేక్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మపైనే అందరి కళ్లు

డర్బన్‌‌‌‌: సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌కు యంగ్‌‌‌‌ టీమిండియా రెడీ అయ్యింది. సీనియర్ల రిటైర్మెంట్‌‌‌‌తో ఏర్పడిన లోటును పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు ఐపీఎల్‌‌‌‌ స్టార్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రొటీస్‌‌‌‌తో ఇండియా తొలి మ్యాచ్‌‌‌‌ ఆడనుంది. రోహిత్‌‌‌‌, కోహ్లీ, జడేజాలాంటి సూపర్‌‌‌‌ స్టార్లు ఈ ఫార్మాట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పడంతో ఇప్పుడున్న యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు టీమ్‌‌‌‌లో చోటు సుస్థిరం చేసుకునేందుకు ఇది మంచి చాన్స్‌‌‌‌. దీంతో ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సంజూ శాంసన్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ శర్మ, తిలక్‌‌‌‌ వర్మ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇక నుంచి జట్టుకు ప్రధాన ప్లేయర్లుగా మారాలని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన సిరీస్‌‌‌‌లో సెంచరీతో చెలరేగిన శాంసన్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాడు. అభిషేక్‌‌‌‌ శర్మ కూడా ఈ సిరీస్‌‌‌‌లో సత్తా చూపేందుకు ప్లాన్స్‌‌‌‌ రెడీ చేశాడు. జింబాబ్వేపై 47 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ కొట్టిన ఆటను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. కాకపోతే తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌‌‌‌ల్లో అతను ఫెయిల్‌‌‌‌కావడం కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ సిరీస్‌‌‌‌లో మళ్లీ మునుపటి ఫామ్‌‌‌‌ చూపెడితే ప్లేస్‌‌‌‌కు ఢోకా ఉండకపోవచ్చు. 

లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేయడం అభిషేక్‌‌‌‌కు మరింత అడ్వాంటేజ్‌‌‌‌. తెలుగు బ్యాటర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మది కూడా సేమ్‌‌‌‌ పరిస్థితి. 2023లో విండీస్‌‌‌‌పై టీ20 కెరీర్‌‌‌‌ను ఘనంగా ఆరంభించిన అతను ఆ తర్వాత మళ్లీ తన హవా కొనసాగించలేకపోయాడు. 12 మ్యాచ్‌‌‌‌ల్లో  ఒకే ఒక్క ఫిఫ్టీ చేశాడు. ఆఫ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేయడం అతనికి అతి పెద్ద ఆయుధంగా మారనుంది. వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ జితేష్‌‌‌‌ శర్మ, స్పిన్నర్‌‌‌‌ వరుణ్‌‌‌‌ చక్రవర్తి కూడా రేస్‌‌‌‌లో ఉండాలని భావిస్తున్నారు. 

ఈ సిరీస్‌‌‌‌ను వీరిద్దరు అద్భుత అవకాశంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు ఎదురులేకపోయినా, ఐపీఎల్‌‌‌‌, డొమెస్టిక్‌‌‌‌లో రాణించిన వైశాక్‌‌‌‌ విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌, యష్‌‌‌‌ దయాల్‌‌‌‌నుంచి పోటీ తప్పకపోవచ్చు. బ్యాటింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రమన్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ డెబ్యూ చేసే చాన్స్‌‌‌‌ ఉంది. సూర్యకుమార్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ పాండ్యా, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లకు ప్రస్తుతానికి ఢోకా లేదు. 

ప్రతీకారం కోసం..

మరోవైపు జూన్‌‌‌‌లో జరిగిన టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్లో సౌతాఫ్రికా ఇండియా చేతిలో ఓడింది. దీంతో ఈ సిరీస్‌‌‌‌లో రాణించి పొట్టి కప్‌‌‌‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటీస్‌‌‌‌ ఎదురుచూస్తోంది. దీనికోసం టీ20 స్టార్లందర్ని రంగంలోకి దించింది. మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌, మిల్లర్‌‌‌‌, హెండ్రిక్స్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. 

ఎంకాబయోమ్జీ పీటర్‌‌‌‌, ఆండిలే సిమెలన్ అరంగేట్రం చేయొచ్చు. పేసర్‌‌‌‌ కోయెట్జీ, స్పిన్నర్‌‌‌‌ కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ నుంచి ముప్పు తప్పదు. ఇక డర్బన్‌‌‌‌ పిచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలమని సంకేతాలు వస్తున్నాయి. కానీ మ్యాచ్‌‌‌‌ సమయంలో వర్షం పడే అవకాశాలు 40 శాతం ఉన్నాయని వాతావరణ నివేదిక. గత ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో యావరేజ్‌‌‌‌ స్కోరు 184గా ఉంది. కాబట్టి టాస్‌‌‌‌ గెలిస్తే బ్యాటింగ్‌‌‌‌ తీసుకునే చాన్స్‌‌‌‌ ఉంది. 

జట్లు (అంచనా)

ఇండియా: సూర్యకుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), శాంసన్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ శర్మ, తిలక్‌‌‌‌ వర్మ, హార్దిక్‌‌‌‌ పాండ్యా, రింకూ సింగ్‌‌‌‌, రమన్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, వరుణ్‌‌‌‌ చక్రవర్తి.

సౌతాఫ్రికా: మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రెజా హెండ్రిక్స్‌‌‌‌, రైన్‌‌‌‌ రికెల్టన్‌‌‌‌, ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌, హెన్రిచ్‌‌‌‌ క్లాసెన్‌‌‌‌, డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌, మార్కో జెన్‌‌‌‌సెన్‌‌‌‌ / గెరాల్డ్‌‌‌‌ కోయెట్జీ, ఆండిలే సిమెలన్, ఎంకాబయోమ్జీ పీటర్‌‌‌‌, కేశవ్‌‌‌‌ మహరాజ్‌‌‌‌, బార్ట్‌‌‌‌మన్‌‌‌‌.