కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు

కేంద్రానికి, ఎన్నికల సంఘానికి  సుప్రీం నోటీసులు

ఎన్నికలకు ముందు ఉచిత హామీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రజాధనంతో ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ. పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం .. ఇది చాలా సీరియస్ అంశం అని.. ఉచిత హామీల బడ్జెట్.. సాధారణ బడ్జెట్ ను దాటిపోతోందన్నారు. కేంద్రం ,ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు.  తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.