ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు.. ఆకట్టుకుంటున్న మోడీ కవిత

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు.. ఆకట్టుకుంటున్న మోడీ కవిత
న్యూఢిల్లీ: కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు ప్రధాని మోడీ విషెస్ చెప్పారు. అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేగాక ఆయన ఓ కవితను కూడా రాశారు. ఇప్పుడే సూర్యుడు ఉదయించాడంటూ మోడీ రాసిన కవిత స్ఫూర్తిమంతంగా ఉంది.  మోడీ కవితను, ఆయన వాయిస్ ఓవర్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆ కవితా పంక్తులు మోడీ మాటల్లోనే.. ‘ఆకాశం వైపు తల పైకెత్తి ఘనీభవించిన మబ్బులను చీల్చుకొని వెలుగు సంకల్పం తీసుకుందాం ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు! దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తూ ప్రతి అడ్డంకిని దాటుతూ కారుచీకట్లను తొలగించడానికై ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు! విశ్వాసపు జ్యోతులను వెలిగించి అభివృద్ధి దీపాలను తీసుకొని స్వప్నాలను సాకారం చేసుకోవడానికి ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు! నీదీ నాదీ.. వాళ్లదీ వీళ్లదనే తేడాల్లేక అందరి తేజమై ప్రకాశిస్తూ ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు! నిప్పులు చెరుగుతూ.. వెలుగుల్ని వెదజల్లుతూ తాను నడుస్తూ.. అందర్నీ నడిపిస్తూ ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు! ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!’ అని మోడీ నూతన సంవత్సరం సందర్భంగా సందేశం ఇచ్చారు. Let's start our first day of the new year with a mesmerizing and motivating poem 'Abhi toh Suraj Uga hai', written by our beloved PM @narendramodi. @PIB_India @MIB_India @PMOIndia pic.twitter.com/9ajaqAX76w — MyGovIndia (@mygovindia) January 1, 2021