మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‎గా మారింది. కుటుంబ విభేదాలతో రోడ్డెక్కిన మంచు ఫ్యామిలీ మెంబర్స్.. పోలీస్ స్టేషన్‎లో పరస్పరం ఫిర్యాదులు సైతం చేసుకున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ బలవంతంగా తండ్రి ఇంట్లోకి వెళ్లడం, మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి, మనోజ్ ఇంట్లో విష్ణు కరెంట్ నిలిపివేయడం వంటి అంశాలతో దాదాపు 10  రోజుల పాటు మంచు ఫ్యామిలీ ఇష్యూ మీడియాలో ట్రెండింగ్‎లో నిలిచింది. మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమణిగిందనుకునే లోపే.. మరోసారి మంచు ఫ్యామిలీలో వార్తల్లోకెక్కింది. ఈ సారి ఫ్యామిలీ విభేదాలతో కాకుండా.. జంతువులను వేటాడిన కేసులో హెడ్ లైన్స్‎లో నిలిచింది. 

Also Read : విషమంగానే శ్రీతేజ్‌ పరిస్థితి

హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు సిబ్బంది జంతువులను వేటాడినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడాడు. ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు. విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడి బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. విష్ణు సిబ్బంది జంతువులను వేటాడంపై మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన  మేనేజర్, ఎలక్ట్రిషన్ మనోజ్ మాటలను పట్టించుకోకుండా అలాగే వేట కొనసాగించినట్లు సమాచారం. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.