నష్టపోయిన దేశ ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

నష్టపోయిన దేశ ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

శుక్రవారం 1,093 పాయింట్లు పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌

ముంబై : దేశ ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వరసగా మూడో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ తీవ్రంగా నష్టపోయాయి. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు కీలక లెవెల్స్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయాయి.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ  రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకుంటుందనే భయాలు ఒకవైపు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింతగా పెంచుతాయనే ఆందోళనలు మరోవైపు ఇన్వెస్టర్లను వెంటాడాయి. డాలర్ మారకంలో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారడం కూడా శుక్రవారం మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1,093 పాయింట్లు (1.82 %) తగ్గి 58,841 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 1,247 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ  347 పాయింట్లు నష్టపోయి 17,531 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో  అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌‌‌‌‌, టెక్‌‌‌‌‌‌‌‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, ఎం అండ్ ఎం, విప్రో, టీసీఎస్‌‌‌‌‌‌‌‌, నెస్లే ఇండియా షేర్లు భారీగా పతనమయ్యాయి. 30 షేర్లు ఉన్న సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో ఒక్క ఇండస్‌‌‌‌‌‌‌‌ ఇండ్ బ్యాంక్ షేరు మాత్రం లాభాల్లో ముగియగలిగింది. ఇన్వెస్టర్ల సంపద  శుక్రవారం రూ. 5 లక్షల కోట్లు తగ్గింది. 

గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ల వలనే..
గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు నష్టపోతుండడం దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌లపై ఒత్తిడి పెంచిందని, యూఎస్ బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు పెరుగుతుండడం, డాలర్ ఇండెక్స్ బలపడుతుండడంతో దేశ ఎకానమీ మెరుగ్గా కనిపిస్తున్నా మన మార్కెట్‌‌‌‌‌‌‌‌లు నష్టపోయాయని   జియోజిత్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ వినోద్  నాయర్ పేర్కొన్నారు. యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ డేటా విడుదలయినప్పటి నుంచి  ఫెడ్ మానిటరీ పాలసీని మరింత కఠినతరం చేస్తుందనే భయాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. వారం ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్ శుక్రవారం నాటికి 952 పాయింట్లు (1.59 శాతం) తగ్గింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయింది.  ‘ఈ వారంలోని చివరి ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సుమారు 2 శాతం మేర పడ్డాయి. అన్ని సెక్టార్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనపడగా ఐటీ, రియల్టీ, ఆటో షేర్లు ఎక్కువగా నష్టపోయాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అజిత్ మిశ్రా వివరించారు.