ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం.. సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

సంగారెడ్డి జిల్లా కోర్టు సెప్టెంబర్ 12న( గురువారం) సంచలన తీర్పు ప్రకటించింది. మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 27 ఏండ్ల తరువాత మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. బీహార్ రాష్ట్రానికి చెందిన గఫార్ అలీ.. 2023 అక్టోబర్ లో ఐదేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ALSO READ | మహిళా సంఘం పైసలు వాడుకుండని స్తంభానికి కట్టేసిన్రు

కూల్ డ్రింగ్స్ లో మద్యం కలిపి తాగించి పంటపొలాల్లో అత్యాచారం చేసి హత్య చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 11నెలలోపే నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది.. ఘటన తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామనికోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి శిక్షలు చూసి మళ్లీ అత్యాచారం చేయడానికి ఎవరూ ఉందుకు రారని.. పలువురు న్యాయవాదులు కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు.