IND Vs NZ, 1st Test: మన చేతుల్లోనే మ్యాచ్.. బెంగళూరు టెస్టుకు వర్షం అంతరాయం

బెంగళూరు టెస్టులో టీమిండియా ప్రమాదం నుంచి బయటపడినట్టే కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అవ్వడం.. ఆ తర్వాత న్యూజిలాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 356 పరుగుల భారీ భాగస్వామ్యం అప్పగించడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి ఖాయమని సగటు క్రికెట్ అభిమాని భావించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించింది. ప్రతి ఒక్కరూ  బాధ్యతగా ఆడుతూ భారత్ ను పటిష్ట స్థితికి చేర్చారు. 

ఇదిలా ఉంటే రసవత్తరంగా మారుతున్న టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. నాలుగో రోజు లంచ్ కు అరగంట ముందు వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం పడడంతో అంపైర్లు అరగంట ముందే లంచ్ బ్రేక్ ఇచ్చారు. వరుణుడు కరుణిస్తే  మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో మొత్తం 5 సెషన్ లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి ఫలితం అయినా సాధ్యం కావొచ్చు. వర్షం పడితే డ్రా ఖాయంగా కనిపిస్తుంది.      

Also Read : పంత్ ఈజీ రనౌట్ మిస్ చేసిన న్యూజిలాండ్

నాలుగో రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో సర్ఫరాజ్(125)తో పాటు హాఫ్ సెంచరీ చేసిన పంత్ (53) ఉన్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 132 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు. భారత్ కేవలం 12 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. 3 వికెట్లకు 231 పరుగుల వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వేగంగా ఆడుతూ వికెట్ కోల్పోకుండా 113 పరుగులు జోడించింది.