జీవో 317 బాధితుల హామీలు అమలు చేయాలి

  • ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఉద్యోగులు, టీచర్ల నిరసన  

ముషీరాబాద్, వెలుగు:  జీవో 317 బాధితులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి  వెంటనే అమలు చేయాలని 317 జీవో డిస్ లోకేటెడ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది.  జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద న్యాయ దీక్ష చేపట్టారు. 

జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు పడగంటి అజయ్ కుమార్, ఎల్లగొండ రత్నమాల మాట్లాడుతూ..  తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమను సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ సమస్యతో బాధపడుతున్నారని, ఇప్పటివరకు 52 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో జీవో బాధితులు పాల్గొన్నారు.