చోరీ కేసును ఛేదించిన పోలీసులు..రూ.29.25 లక్షలు రికవరీ

జడ్చర్ల టౌన్, వెలుగు: ఈ నెల 16న జడ్చర్లలో ఆర్టీసీ బస్ లో రూ.36 లక్షలు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ జానకి మంగళవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్​లో మీడియాకు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పురుషోత్తం ఎంజీబీఎస్ లో పికెట్  బస్సు ఎక్కడాన్ని గమనించిన యూపీలోని బిజినూర్ కు చెందిన సత్తార్, షారుక్, దిల్షాద్​లు బస్సు ఎక్కారని తెలిపారు. నిందితుల్లో ఒకరు బాధితుడి పక్కన కూర్చోగా, మిగిలిన ఇద్దరు బ్యాగులో నుంచి డబ్బులు తీసుకొని వాటర్  బాటిల్  నింపారని చెప్పారు.

సత్తా ర్, దిల్షాద్​ డబ్బులు తీసుకుని మధ్యలోనే దిగిపోగా, జడ్చర్ల బస్టాండ్ కు చేరుకున్న తర్వాత బ్యాగును చూసుకున్న బాధితుడు డబ్బులు కనిపించకపోవడంతో పోలీస్  స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జడ్చర్ల బస్టాండ్ లో సీసీ కెమెరాలను పరిశీలించనప్పటికీ పూర్తి ఆధారాలు లభించకపోవడంతో, హైదరాబాద్​లోని సీసీ కెమెరాలను పరిశీలించి వాటి ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. యూపీలోని బిజినూర్​లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.29.25 లక్షలు రికవరీ చేశామన్నారు. రూ.75 వేలు పహాడీ షరీఫ్ లో షెల్టర్  ఇచ్చిన వారికి ఇచ్చి తిరిగి తీసుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐలు ఆదిరెడ్డి, నాగార్జున గౌడ్ తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు.